సోమందేపల్లి: పట్టణంలోని 14 పోలింగ్ బూత్‌ల పరిధిలో మిస్సింగ్ ఓట్లను గుర్తించి నమోదు చేయడానికి అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు, బీఎల్‌ఏలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డి.వి. ఆంజనేయులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సోమశేఖర్, టీడీపీ పట్టణ అబ్జర్వర్, మండల కన్వీనర్ వెంకటేష్, మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, పట్టణ అధ్యక్షుడు సూరి, తహసీల్దార్ మారుతి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు, ఇతర మండల శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పట్టణానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై, బూత్‌ల వారీగా తమ ఓటరు వివరాలను పరిశీలించారు. పేరు నమోదు, మార్పులు, సవరణల ప్రక్రియను అక్కడికక్కడే పూర్తి చేసుకున్నారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన రెవెన్యూ యంత్రాంగానికి స్థానికులు అభినందనలు తెలిపారు.

0 కామెంట్‌లు