అనంతపురం, జూలై 9 (మీకోసం న్యూస్): అనంతపురం నగరంలోని కమలా నగర్ ఫస్ట్ రోడ్డులో శ్రీనిధి ప్రింటింగ్ ఎదురుగా ఏర్పాటు చేసిన నోబెల్ జాబ్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సాకే శ్వేత, ప్రభా మేడమ్స్ ఆహ్వానం మేరకు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో సాకే శ్వేత భర్త పూలకుంట సాకే చంద్ర, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి, నగర ఉపాధ్యక్షుడు సురేంద్ర తేజ, నగర ప్రధాన కార్యదర్శి వల్లూరి బాబు, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, ఉరుముల కళాకారుల నాయకుడు మేడాపురం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నోబెల్ జాబ్ కన్సల్టెన్సీ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట చియ్యేడు రాము పాల్గొన్నారు.

0 కామెంట్‌లు