SIR ప్రక్రియ వేగవంతం చేయాలి.. ప్రతి ఓటు డిజిటల్ నమోదు చేసుకోవాలి

మీకోసం న్యూస్ I రొద్దం 
 రొద్దం, జూలై 10 (మీకోసం న్యూస్): రాష్ట్ర మంత్రి శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలంలో SIR (Special Intensive Revision) కార్యక్రమాన్ని శుక్రవారం విస్తృతంగా పరిశీలించారు. SIR ప్రక్రియలో వెనుకబడి ఉన్న రొద్దం టౌన్‌లోని 21, 23 పోలింగ్ బూత్‌లు, అలాగే నల్లూరు, చోలేమర్రి గ్రామాల్లో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జూలై 14తో SIR ప్రక్రియ ముగియనున్నందున అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటును డిజిటల్ విధానంలో నమోదు చేసుకుని ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. మిగిలిన మూడు రోజులను పూర్తిగా SIR కార్యక్రమానికే కేటాయించి, ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు నమోదు పూర్తి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రొద్దం మండల SIR అబ్జర్వర్, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ రెడ్డివారి మంజునాథ్, రొద్దం సింగిల్ విండో డైరెక్టర్ వీరాంజనేయులు, ఆర్డీవో ఆనంద్ కుమార్, ఎంఆర్వో ఉదయ్ కుమార్, రాజు, నాయకులు మారెప్ప, మాజీ సర్పంచ్ జనార్ధన్, నల్లూరు గోపాల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు