హిందూపురం, జూలై 18 (మీకోసం న్యూస్): హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సుమారు పది కుటుంబాలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బాలు, గంగరాజు, శివ, ఆది, మంజు, శివప్ప, శేషాద్రి, రూపేష్, నవీన్‌కుమార్, శివకుమార్, శంకరప్ప, వెంకటేష్, ఆనంద్‌కుమార్, అశ్వర్థన్నారాయణ తదితరులు పార్టీ కండువా కప్పుకుని టీడీపీలో చేరారు.
పార్టీలో చేరిన వారిని స్థానిక నాయకులు ఆహ్వానిస్తూ, హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలు కూడా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అబిలాష్, మాజీ పార్లమెంట్ కార్యదర్శి వీరశేఖర్, నాయనపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు వై.వి. వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ సదాశివారెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మమతారెడ్డి యూనిట్ ఇన్‌చార్జి మహేష్, బూత్ ఇన్‌చార్జి ఆనంద్, రామాంజి, సురేష్, రాజు, నరసింహమూర్తి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు