ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కనగానపల్లి గ్రామంలో ఇకపై తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సరఫరా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
తాగునీటి సమస్య పరిష్కారంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు