దివ్యాంగులకు చేయూత.. 60 ఉచిత మూడు చక్రాల స్కూటీల పంపిణీ

పుట్టపర్తిలో రాష్ట్ర చైర్మన్ గడుపూటి నారాయణస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత

పుట్టపర్తి, జూలై 21 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన 60 మంది దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగుల స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలు, విద్య, ఉపాధి, నిత్యజీవనంలో సులభ రాకపోకలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగూర్ ఉమర్ (స్టాలిన్), జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైలైట్
==========================================
"దివ్యాంగుల స్వావలంబనకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. అవసరమైన సహాయాన్ని నిరంతరం అందిస్తాం." – రాష్ట్ర చైర్మన్ గడుపూటి నారాయణస్వామి.
==========================================
-మీకోసం న్యూస్ 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు