పరిగి, మీకోసం న్యూస్: పరిగి టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పెనుకొండ ఎమ్మెల్యే, చేనేత–బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో మండల కన్వీనర్ ఎస్.ఎన్. గోవింద్ రెడ్డి, సూర్యనారాయణ, ఈ. నాగభూషణం, మండల కోఆర్డినేటర్ గంగాధర్, బూత్ కన్వీనర్లు వినోద్, రాము, జయప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
0 కామెంట్‌లు