బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఉషశ్రీ చరణ్.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రకటన
పరిగి: కొద్ది నెలల క్రితం పరిగి కేంద్రానికి చెందిన వడ్డే సునీల్ హత్య కేసులో నిందితులకు ఇప్పటికీ రిమాండ్ విధించలేదంటూ మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి తీసుకెళ్లి హత్య చేసి అనంతరం చెట్టుకు ఉరివేసినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, అసలు నిందితులపై చర్యలు ఆలస్యం అవుతున్నాయని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరగకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. అసలు నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని తెలిపారు.
అలాగే మంత్రి సవితపై ప్రభుత్వం చర్యలు తీసుకుని మంత్రి పదవి నుంచి తొలగించాలని, కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు