హరిపురంలో సీసీ రోడ్డు ప్రారంభం.. కురుబవాండ్లపల్లి బీటీ రోడ్డుకు భూమిపూజ

పెనుకొండ, మీకోసం న్యూస్: పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం ఎర్రమంచి పంచాయతీ హరిపురంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం హరిపురం నుంచి కురుబవాండ్లపల్లి వరకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు