గాండ్లపెంటలో 29న సామూహిక అక్షరాభ్యాసం27లోపు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారుల పిలుపు

గాండ్లపెంట, మీకోసం న్యూస్: గాండ్లపెంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈనెల 29వ తేదీ బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల తహసీల్దార్ నరసింహులు, ఎస్సై సుమతి, మండల విద్యాశాఖ అధికారి కృష్ణ నాయక్, ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆదరణ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని వివరాలు వెల్లడించారు.

మండలంలో తొలిసారిగా పెద్దఎత్తున చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు పూర్తై ఆరు సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారుల తల్లిదండ్రులు ఈనెల 27వ తేదీలోపు పేర్లు నమోదు చేయించి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

వేద పండితుల ఆశీర్వాదాలతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం వారి విద్యాభ్యాసానికి శుభారంభమవుతుందని తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించాలని కోరారు.

27వ తేదీలోపు నమోదు చేసుకున్న ప్రతి చిన్నారికి ఉచితంగా పలక, బలపం అందజేయనున్నట్లు ఆదరణ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు నాగేష్, కోడూరు శ్రీకాంత్ తెలిపారు. పేర్ల నమోదు కోసం 9000034688, 8106899258 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, పీడీ హరిప్రసాద్, పాఠశాల చైర్మన్ రెడ్డే నాయక్, ఆదరణ డెవలప్మెంట్ ట్రస్ట్ సిబ్బంది వెంకటేష్ నాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు