అనంతపురం, జూలై 22 (మీకోసం న్యూస్): అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన మాల మహిళా నాయకురాలు మాల కామాక్షమ్మ తండ్రి మాల ఈశ్వరప్ప అనారోగ్యంతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిమోనియా బారిన పడిన ఆయన గత వారం రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి మాల ఈశ్వరప్పను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పరామర్శించిన వారిలో ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము, జిల్లా ఉప కార్యదర్శి మాల మల్లికార్జున, బేతాళ శరత్, జిల్లా అధ్యక్షుడు భక్తుల కిషోర్, మాల మహానాడు మహిళా నాయకురాలు మాల కామాక్షమ్మ, నగర ఉపాధ్యక్షుడు బి. సురేంద్రబాబు, నగర ప్రధాన కార్యదర్శి వల్లూరు బాబు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు