నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సోమందేపల్లి నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. బస్సులు ఆగకపోవడంతో ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సోమందేపల్లిలో కనీసం హైవే స్టాప్ వద్దైనా బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
-మీకోసం న్యూస్

0 కామెంట్‌లు