సోమందేపల్లి, మీకోసం న్యూస్:
పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు నరసింహరావు మంగళవారం సోమందేపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, తోగట వీరక్షత్రియుల ఆరాధ్యదైవమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త, మాస్టర్ వీవర్, సీనియర్ రాజకీయ నాయకుడు డీసీ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి నరసింహరావుతో పాటు రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, తహసీల్దార్ మారుతికి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య నరసింహరావు, వెంకటరమణ, తహసీల్దార్ మారుతిలను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో విచ్చేసిన నాయకులు, అధికారులకు ప్రత్యేకంగా అల్పాహార విందు ఏర్పాటు చేసి ఆతిథ్యం అందించారు.
ఈ కార్యక్రమంలో డీసీ లోకేష్, జ్యోతి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, గట్టు మహేంద్ర, అశ్వర్థ, జేసీబీ కొత్తపల్లి రంగా, రంగన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
-మీకోసం న్యూస్

0 కామెంట్‌లు