పుట్టపర్తి, జూలై 14: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 70 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో స్వయంగా మాట్లాడి సమస్యలను ఓర్పుగా విన్న ఎస్పీ, ప్రతి వినతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, సివిల్ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వేదికకు వచ్చాయి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ప్రజలు పోలీసు శాఖపై నమ్మకంతో తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్‌లు