శ్రీ సత్యసాయి జిల్లా , జూలై 14: జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జేసీ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఫారాల స్వీకరణ, పరిశీలన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
-మీకోసం న్యూస్

0 కామెంట్‌లు