శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జలధార–జలహారతి' కార్యక్రమం 100 శాతం లక్ష్యాలను పూర్తి చేసి విజయవంతంగా ముగిసింది. చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా చేపట్టిన పనులు జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్తో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి నిల్వలు పెరగడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్‌లు