సోమందేపల్లి, జూలై 25 (మీకోసం న్యూస్): విజయవాడ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన యువ క్రీడాకారుడు మహమ్మద్ ఉస్మాన్‌కు సోమందేపల్లి లో ని ఇందిరానగర్ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.
ఈ పోటీల్లో ఉస్మాన్ 100 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించగా, లాంగ్ జంప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుని ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు, సేవా సమితి సభ్యులు ఉస్మాన్ విజయాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గట్టా మహేంద్ర, ఈశ్వర్ యాదవ్, ఎం. అమర్‌నాథ్, ఎర్రజోడు జయరాములు, దాసరి శ్రీనాథ్, బండారు మంజునాథ్, శ్రీనివాసులు, మారుతి, వేణు, గిరి, దామోదర్, విష్ణు, నూర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు