సోమందేపల్లి, జూలై 25 (మీకోసం న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి విద్యలో రాణించాలని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రతి ఒక్కరికీ విశ్వాసం పెరిగేలా కృషి చేయాలని టీడీపీ నాయకులు నీరుగంటి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ జీవితాంతం విద్యార్థులేనని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలకు పోటీగా నిలవడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఫలితమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని చెప్పారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కొనియాడారు.
'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రయోజనం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్దేనని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
సోమందేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నీరుగంటి చంద్రశేఖర్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పర సాగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, హెచ్‌ఎం రామాంజినేయులు, పట్టణ అధ్యక్షుడు వడ్డీ సూరి, స్కూల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, వైస్ చైర్మన్ నబిరా బాబు, జనసేన మండల కన్వీనర్ జబి ఉల్లా, మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, గట్టు మహేంద్ర, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, పీ.ఎన్. రామాంజినేయులు, సుమిత్ర గంగాధర్ రాయల్, రంగేపల్లి నాగరాజు, మద్దిలేటి, శిరీష, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు