హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు ముమ్మరంనక్కలగుట్ట సమీపంలో వేగంగా సాగుతున్న విస్తరణ పనులు

సోమందేపల్లి, జూలై 25 (మీకోసం న్యూస్):

సోమందేపల్లిలోని నక్కలగుట్ట సమీపంలో హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు శుక్రవారం ముమ్మరంగా కొనసాగాయి. కాలువ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని సక్రమంగా అందించాలనే లక్ష్యంతో విస్తరణ పనులు చేపట్టారు.

భారీ యంత్రాలతో కాలువలోని మట్టిని తొలగిస్తూ వెడల్పు చేసే పనులను అధికారులు వేగవంతం చేశారు. పనులు పూర్తయితే నీటి సరఫరా మెరుగుపడి ఆయకట్టు పరిధిలోని రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.

కాలువ విస్తరణ పనులను నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు