పెనుకొండ, జూలై 4(మీకోసం న్యూస్ ): పెనుకొండ మండలంలోని రాంపురం పంచాయతీ కొండంపల్లి గ్రామంలో ప్రమాదాల్లో గాయపడిన ఇద్దరిని మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు.
మొదట ప్రమాదవశాత్తు గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సమరసింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం మండల యువజన విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

0 కామెంట్‌లు