సోమందేపల్లి, జూలై 2(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని మంచేపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్‌ను గురువారం లబ్ధిదారురాలికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ బి.కె. పార్థసారథి సూచనల మేరకు స్థానిక నాయకులు లబ్ధిదారురాలికి పింఛన్ అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం సంతోషకరమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షాపి మల్లికార్జున (బుల్లెట్), ఫకృద్దీన్, గంగాధరప్పతో పాటు వార్డు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. అర్హురాలైన మహిళకు పింఛన్ మంజూరు కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


0 కామెంట్‌లు