ప్రతిభకు ప్రోత్సాహం.. పారా ఒలింపిక్ విజేత సందీప్‌కు నగదు బహుమతి

మీకోసం న్యూస్ ప్రతినిది-

సోమందేపల్లి, జూలై 25 (మీకోసం న్యూస్):

రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి మండలానికి గర్వకారణంగా నిలిచిన సోమందేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సందీప్‌ను ఘనంగా సన్మానించారు. పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమంలో విద్యార్థి ప్రతిభను కొనియాడుతూ పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, నాయకులు నీరుగంటి చంద్రశేఖర్ పాల్గొని సందీప్‌ను శాలువాతో సత్కరించారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చి గ్రామానికి, ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చినందుకు ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ పంపించిన రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని నీరుగంటి చంద్రశేఖర్ సందీప్‌కు అందజేశారు.

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సందీప్‌కు వారు సూచించారు. ఇలాంటి విద్యార్థులను ప్రభుత్వం, సేవా సంస్థలు ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజినేయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, కూటమి నాయకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు