'నారీ శక్తి వందన్'కు ఇక జాప్యం వద్దు

మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ డిమాండ్

ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ చట్టం అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలతో ముడిపెట్టడం వల్ల అమలు నిరవధికంగా వాయిదా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు దశాబ్దాలుగా సమాన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్నప్పటికీ, చట్టం అమలులోకి రాకపోవడం బాధాకరమన్నారు.

దేశ జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ, పార్లమెంట్‌, శాసనసభల్లో వారికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. అందువల్ల నారీ శక్తి వందన్ చట్టంలోని జనగణన, డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధనలను తొలగిస్తూ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మహిళల అభిప్రాయాలను సేకరించి, వారి సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అంజనమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ సమీరా, అమీనా, బి. బేబీ, లక్ష్మీదేవి, ఆసియా భాను, శంషాద్, రోజా, బి. తస్లిమా తదితరులు పాల్గొన్నారు.

==========================================
"చట్టం ఉంది... అమలు ఎప్పుడు?"
జనగణనతో ముడిపెట్టొద్దు
డీలిమిటేషన్ నిబంధనలు తొలగించాలి
రానున్న ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
కలెక్టర్ ద్వారా కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి.
=====================================

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు