తిరువణ్ణామలై (తమిళనాడు)(మీకోసం న్యూస్ ): తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలైలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరి ప్రదక్షిణ మార్గంలోని ఇరుకైన గుహలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు మణికుమార్ (36) మృతిచెందారు.
కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరువణ్ణామలై చేరుకున్న మణికుమార్.. అనంతరం రాత్రి గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ సందర్భంగా 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయార్ ఆలయాన్ని సందర్శించారు.
ఆ ఆలయంలోని అత్యంత ఇరుకైన గుహలో ఒక వైపు నుంచి ప్రవేశించి మరోవైపు నుంచి బయటకు రావడం అక్కడి సంప్రదాయం. దీనిని భక్తులు 'మోక్ష మార్గం'గా భావిస్తూ, ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగుతాయని విశ్వసిస్తారు.
ఈ క్రమంలో గుహలోకి ప్రవేశించిన మణికుమార్ అధిక బరువు కారణంగా మధ్యలోనే ఇరుక్కుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుహలో సరిపడా గాలి అందక ఊపిరాడక స్పృహ కోల్పోయారు.
కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి ఆయనను బయటకు తీసి వెంటనే 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తిరువణ్ణామలై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి
0 కామెంట్‌లు