బుడ్డన్న సేవలు చిరస్మరణీయం: మాల మహానాడు

మీకోసం న్యూస్ | మడకశిర

మడకశిర, జూలై 11 (మీకోసం న్యూస్): మడకశిరకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి లక్ష్మీ నరసయ్య (బుడ్డన్న)  సంస్మరణ సభ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుడ్డన్న గారు 1985 నుంచి 2026 వరకు ప్రజాసేవలో విశిష్టమైన పాత్ర పోషించారని తెలిపారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన ఎంపీపీ, జడ్పీటీసీ వంటి కీలక ప్రజాప్రతినిధి పదవులు నిర్వహించి ప్రజల ఆదరణ పొందారని కొనియాడారు. అలాగే తన కుటుంబాన్ని కూడా ప్రజాసేవ వైపు నడిపించి, తన కుమారులు ఉన్నత రాజకీయ స్థాయికి ఎదిగేలా కృషి చేశారని పేర్కొన్నారు.

భవిష్యత్తులో మడకశిర పరిధిలోని ఆరు మండలాల మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో బుడ్డన్న గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మాల మహానాడు కమిటీలు ముందుకు వస్తాయని వెల్లడించారు.

అలాగే బుడ్డన్న  కుమారుడు నరసింహ రాజు మరిన్ని రాజకీయ పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి, ఉరుముల కళాకారులకు అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు.

కార్యక్రమంలో మడకశిర మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ రాజు, అనంతపురం జిల్లా మాల మహానాడు ప్రధాన కార్యదర్శి చియ్యేడు రాము, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి, జిల్లా కార్యదర్శి మాల మల్లికార్జున, అనంతపురం నగర అధ్యక్షుడు మాల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు తెనగల్లు కిషోర్, మడకశిర మండల కార్యదర్శి గంగాధర్, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు