పెనుకొండ: పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరాహార దీక్షకు మంగళవారం వైఎస్సార్‌సీపీ పెనుకొండ లీగల్ సెల్ సభ్యులు, స్థానిక న్యాయవాదులు మద్దతు తెలిపారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన న్యాయవాదులు మాట్లాడుతూ, పీపీపీ విధానం అమలుతో ప్రజలతో పాటు డాక్యుమెంట్ రైటర్లకు కూడా నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో న్యాయ వివాదాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానమే ప్రజలకు సులభంగా, పారదర్శకంగా సేవలు అందిస్తోందని, అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగరాజు, శ్రీనివాసులు, మోహన్ నాయక్, శ్రీనివాస్, జావేద్, హరీస్ నాగిరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు