భాష కాదు... కథే ముఖ్యం: అడివి శేష్ 'పాన్ ఇండియా' భావనపై ఆసక్తికర వ్యాఖ్యలు

మీకోసం న్యూస్ I సినిమా 


 హీరో అడివి శేష్‌ భారతీయ సినిమాలను భాషల ఆధారంగా విభజించే విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందే సినిమాలను ఒకే భాషకు పరిమితం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. మంచి కథలకు భాష అడ్డంకి కాకూడదని అన్నారు.

'హిందీ సినిమా', 'తెలుగు సినిమా', 'తమిళ సినిమా' అంటూ వేర్వేరుగా పిలుస్తూనే, మరోవైపు 'పాన్ ఇండియా సినిమా' అనే పదాన్ని ఉపయోగించడం ఆసక్తికరంగా ఉందని శేష్ వ్యాఖ్యానించారు. దేశమంతా ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచగలిగే చిత్రాలను భాషల గీతల్లో కాకుండా **'భారతీయ సినిమాలు'**గా చూడాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రేక్షకుల అభిరుచి మారిందని, మంచి కథ ఏ భాషలో వచ్చినా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా సినీ పరిశ్రమ కూడా మారాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒకే భాష మార్కెట్‌ను కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

రిలీజ్‌కు సిద్ధంగా 'డెకాయిట్'

అడివి శేష్ కథానాయకుడిగా నటించిన 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, జైన్ మేరీ ఖాన్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. మరోవైపు 'గూఢచారి' సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ2' చిత్రంలో కూడా అడివి శేష్ నటిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి, మధు శాలిని ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు