పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు వైభవంగా
కదిరి, జూలై 7 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఈఎఫ్ (MEF) ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ నుంచి బాబు జగ్జీవన్‌రామ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. తర్వాత కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
సభలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పలక ఆంజనేయులు, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి. నాగేంద్రనాథ్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం నిరంతరం ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనలో ఎమ్మార్పీఎస్ పోరాటం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఉద్యమ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

0 కామెంట్లు