కదిరి, జూలై 7(మీకోసం న్యూస్ ): సినీ నటుడు Prakash Raj పై కదిరి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ సీనియర్ నేత Vishnuvardhan Reddy ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేయడంతో పాటు హిందువులు, శ్రీరాముడు, దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, అలాగే Narendra Modi, N. Chandrababu Naidu, Pawan Kalyanలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
అలాగే Y. S. Jagan Mohan Reddy, K. Narayana, సీపీఎం నాయకత్వం ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇవ్వడం వారి వైఖరిని సూచిస్తోందని విమర్శించారు. హిందూ సమాజం, దేవాలయాలు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో స్పష్టం చేయాలని సంబంధిత పార్టీలను ప్రశ్నించారు.
ప్రకాశ్ రాజ్‌పై నమోదైన ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.

0 కామెంట్‌లు