గోరంట్ల, జూలై 7(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం గోరంట్ల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్‌ఐఆర్ (SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి, డేటా ఎంట్రీ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన డేటా నమోదు అత్యంత ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ మధు నాయక్, ఎంపీడీఓ, ఎన్నికల శాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.



0 కామెంట్‌లు