పుట్టపర్తి, జూలై 7:(మీకోసం న్యూస్ )
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 129 అంగన్వాడీ సహాయకురాళ్ల (ఆయా) పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కె. ప్రమీల ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులు మరియు నల్లచెరువు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రాజెక్టుల వారీగా ఖాళీలు
🔹 ఓబులదేవరచెరువు – 95 పోస్టులు
🔹 పుట్టపర్తి – 33 పోస్టులు
🔹 నల్లచెరువు – 1 పోస్టు
➡️ మొత్తం ఖాళీలు: 129
ముఖ్యమైన తేదీలు
📌 దరఖాస్తుల ప్రారంభం: 09-07-2026
📌 చివరి తేదీ: 17-07-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు పొందాలి. పూర్తిగా నింపిన దరఖాస్తులను జూలై 17 సాయంత్రం 5 గంటలలోపు అదే కార్యాలయంలో సమర్పించి రశీదు పొందాలని అధికారులు సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు.
👉 పూర్తి వివరాల కోసం సంబంధిత సీడీపీఓ (CDPO) కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు కోరారు.

0 కామెంట్లు