రైతులకు నాణ్యమైన విత్తనాలు – మెరుగైన దిగుబడులే లక్ష్యం

హిందూపురం కేఎల్ రోడ్డులో రైతులకు విశ్వసనీయ సేవలు అందిస్తున్న శ్రీ సిద్దేశ్వర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్

హిందూపురం, మీకోసం న్యూస్:

వ్యవసాయ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు, సరైన సలహాలు రైతుల విజయానికి కీలకమని భావిస్తూ హిందూపురం పట్టణంలోని కేఎల్ రోడ్డులో, వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న శ్రీ సిద్దేశ్వర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ రైతులకు విశ్వసనీయ సేవలు అందిస్తోంది.

వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి, కూరగాయలతో పాటు వివిధ రకాల పంటలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, కలుపు మందులు, శిలీంద్రనాశకాలు, సూక్ష్మ పోషకాలు, బయో ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉంచారు. ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను రైతులకు సరసమైన ధరలకు అందిస్తూ వారి విశ్వాసాన్ని పొందుతోంది.

పంటలో వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగం, పంటల సంరక్షణపై రైతులకు తగిన సాంకేతిక సూచనలు కూడా అందిస్తున్నారు. దీంతో పరిసర గ్రామాల రైతులు అధిక సంఖ్యలో ఈ దుకాణాన్ని ఆశ్రయిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

రైతులు నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందుల బారిన పడకుండా నాణ్యత కలిగిన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు.

వ్యవసాయ సీజన్ నేపథ్యంలో రైతులకు అవసరమైన అన్ని వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

చిరునామా:

📍 శ్రీ సిద్దేశ్వర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్

కేఎల్ రోడ్, వాటర్ ట్యాంక్ ఎదురుగా, హిందూపురం.

– మీకోసం న్యూస్
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు