కదిరిలో విషాదం.. కాలువలో హోటల్ ఉద్యోగి మృతదేహం

కదిరి, జూలై 15 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని గౌస్పీర్ హోటల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్ మృతదేహం అమీన్ నగర్ బ్రిడ్జి కింద ఉన్న కాలువలో బుధవారం లభ్యమైంది.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అబ్దుల్ రెహమాన్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు