మీకోసం న్యూస్ I హిందూపురం
హిందూపురం, జూలై 10 (మీకోసం న్యూస్):
ఏఐయూ ఆధ్వర్యంలో నిర్వహించే దక్షిణ మండల (సౌత్ జోన్) ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్‌కు అనంతపురం ఎస్కే యూనివర్సిటీ జట్టులో హిందూపురం సప్తగిరి డిగ్రీ కళాశాల విద్యార్థి ఎన్. పవన్ కుమార్ ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఆయన సప్తగిరి డిగ్రీ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పి. శ్రీనాథరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి. గంగిరెడ్డి మాట్లాడుతూ, సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపికైన పవన్ కుమార్‌ను కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు శుక్రవారం ఘనంగా అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

0 కామెంట్‌లు