ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు



మీకోసం న్యూస్ I హిందూపురం 


 హిందూపురం, జూలై 10 (మీకోసం న్యూస్): హిందూపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 11, 12 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వెంకటేశు తెలిపారు.

ఈ రెండు రోజుల పాటు సంబంధిత బీఎల్‌వోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు వివరాలను పరిశీలించి అవసరమైన సహాయాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు దరఖాస్తుల సమర్పణకు జూలై 14 చివరి తేదీ కావడంతో, ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన ఓటర్లు ఆలస్యం చేయకుండా సంబంధిత బీఎల్‌వోలను లేదా ప్రత్యేక ప్రచార దినాల్లో తమ పోలింగ్ కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

నియోజకవర్గ ప్రజలందరూ జూలై 11, 12 తేదీలలో నిర్వహించే ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని, గడువు ముగిసేలోపు దరఖాస్తులు సమర్పించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సహకరించాలని తహసీల్దార్ వెంకటేశు విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు