చేనేత కార్మికులను ఆదుకోవాలి: జింక నాగరాజు

మీకోసం న్యూస్ I సోమందేపల్లి 


 సోమందేపల్లి: స్థానిక గాంధీనగర్‌లో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకుడు జింక నాగరాజు మాట్లాడారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చేనేత కుటుంబాలకు అన్ని సంక్షేమ పథకాలను అందించి, పరిశ్రమను పరిరక్షించాలని చేనేత కార్మికులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు