మీకోసం న్యూస్ I మడకశిర
మడకశిర, జూలై 11 (మీకోసం న్యూస్):మడకశిర క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, సమస్యలను స్వయంగా స్వీకరించిన వారు సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఓర్పుగా విని స్పందించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
మీకోసం న్యూస్

0 కామెంట్‌లు