సోమందేపల్లి: పవిత్ర తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమందేపల్లి మండలం కదిరేపల్లి లో వెలసిన లక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమందేపల్లి తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, యస్ ఐ సుధాకర్ యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ పెద్దలు రామకృష్ణ, శరత్ చంద్ర, సంజీవరెడ్డి అధికారులు దగ్గరుండి స్వామి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు అధికారులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

0 కామెంట్‌లు