మాల గాయత్రి కుటుంబానికి మాల మహానాడు అండ.. ఓదార్పుతో పాటు రుణ సహాయం

మడకశిర, మీకోసం న్యూస్: కీర్తిశేషులైన మాల గాయత్రి భర్త మాల గంగాధర్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నాయకులు పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. "ఓదార్పు - పరామర్శించు కార్యక్రమం"లో భాగంగా బాధిత కుటుంబాన్ని కలిసి వారి పరిస్థితిని తెలుసుకుని, సంస్థ తరఫున కొంత రుణ సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మాల గాయత్రి కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు మాల మహానాడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర శాశ్వత ఉపాధ్యక్షులు దళితరత్న ఎస్‌కేయూ ఓబులేష్, అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షులు పోలీస్ చెన్నప్ప, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి, జిల్లా అధ్యక్షులు బేతాల శరత్, తెనగళ్లు భక్తుల కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము, జిల్లా ఉప కార్యదర్శి కుందుర్పి మల్లికార్జున, అనంతపురం నగర ఉపాధ్యక్షులు బి. సురేంద్ర, నగర ప్రధాన కార్యదర్శి వల్లూరు బాబు, ఉరుముల కళాకారుల నాయకులు పూలకుంట లక్ష్మీనారాయణ, సత్యసాయి జిల్లా MEWA ప్రధాన కార్యదర్శి టీచర్ సి. తిప్పే స్వామి, రిటైర్డ్ టీచర్, న్యాయవాది జిల్లేడుగుంట వసంతప్ప, గుడిబండ మండలం MEWA ప్రధాన కార్యదర్శి మాల నాగరాజు, సీనియర్ నాయకులు బి. పాండురంగమూర్తి, మడకశిర మండల అధ్యక్షులు మాల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి మాల గంగాధర్, రాళ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఎస్.డి. లక్ష్మీనారాయణ, జంబులపండ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఉరుముల కళాకారులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మాల గాయత్రి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు