కొత్తచెరువులో తాగునీటి సమస్యపై మహిళల వినతి

కొత్తచెరువు, జూలై 18 (మీకోసం న్యూస్): కొత్తచెరువు మండల కేంద్రంలోని బసవన్న కట్ట, పెద్ద మసీదు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై స్థానిక మహిళలు పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మండలంలో తాగునీటి కొరత లేకుండా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. అలాగే నిరుపేదలకు గృహాలు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చారని పేర్కొన్నారు.

ప్రస్తుతం మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, తాగేందుకు కూడా సరిపడా నీరు అందని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఈ సమస్య పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించలేదని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు