వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన కొండూరు వేణుగోపాల్ రెడ్డి


 మీకోసం న్యూస్ I చిలమత్తూరు 

చిలమత్తూరు, జూలై 9: చిలమత్తూరు మండలం కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ రజక విభాగం అధ్యక్షుడు సి. రమేష్ తండ్రి, పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరమణప్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ నేపథ్యంలో హిందూపురం సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డి, చిలమత్తూరు మండల నాయకుడు శెట్టిపల్లి జగన్మోహన్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నరసింహా రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త పుల్లారెడ్డి కలిసి వెంకటరమణప్ప నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వెంకటరమణప్ప మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన వారు, కుటుంబానికి ధైర్యం చెప్పి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మధురేపల్లి గ్రామానికి చెందిన అల్తాఫ్, శేఖర్, చాకలి నాగ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు