బ్రాహ్మణపల్లిలో హౌసింగ్ గ్రామసభ నిర్వహణ

 



బ్రాహ్మణపల్లి జూలై 03 (మీకోసం న్యూస్ : గ్రామంలో శుక్రవారం హౌసింగ్ గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ హాజరై గ్రామంలో అమలవుతున్న హౌసింగ్ పథకాలపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలు, మంచినీటి ట్యాంకు, ఎస్‌ఐఆర్ (SIR) పరిధిలో గ్రామ పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ, బీఎల్‌వో మల్లికార్జున, హౌసింగ్ ఏఈ రామాంజినేయులు, సంబంధిత శాఖల సిబ్బంది, గ్రామ కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు