గొల్లపల్లిలో 125 రోజుల ఉపాధి హామీ పనులకు శ్రీకారం


 పరిగి, జూలై 2(మీకోసం న్యూస్ ): పరిగి మండలం బీచ్‌గానిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్‌జీ పథకం కింద 125 రోజుల ఉపాధి హామీ పనులను గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎస్.ఎన్. గోవింద్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ, ఏపీవో అప్పి స్వామి నాయుడు, ఎంపీటీసీ గంగాధరప్ప, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ. గంగాధరప్పతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ పనులను సకాలంలో పూర్తి చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు