సోమందేపల్లి, జూలై 2(, మీకోసం న్యూస్ ): సోమందేపల్లి మండలం మగేచెరువుగ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పరిష్కారం చూపించారు. గ్రామస్థులు సమస్యను రాష్ట్ర సగర (ఉప్పర) కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, తహసీల్దార్ మారుతి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించారు.
అధికారుల ఆదేశాల మేరకు జేసీబీతో బోర్‌వెల్‌కు అడ్డుగా ఉన్న చెట్లు, మట్టిని తొలగించి మార్గాన్ని సుగమం చేశారు. అనంతరం పాడైన మోటారు పంపు, కేబుల్‌ను తొలగించి కొత్తవి అమర్చడంతో బోర్‌వెల్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది.
దీంతో గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమైంది. సమస్యను వెంటనే పరిష్కరించిన మంత్రి సవితమ్మ, రాష్ట్ర సగర (ఉప్పర) కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, తహసీల్దార్ మారుతికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


0 కామెంట్‌లు