హిందూపురంలో 19న ఈడిగ–గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

హిందూపురం/విజయవాడ, జూలై 14 (మీకోసం న్యూస్): హిందూపురం ఆర్య ఈడిగ–గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న హిందూపురం పట్టణంలోని ఈడిగ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎస్. సవిత, జిల్లా ఇన్‌చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ చైర్మన్ కొనకళ్ల సత్యనారాయణ, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, మాజీ కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాశ్ నారాయణ్‌లను మంగళవారం విజయవాడ సచివాలయంలో సంఘం నాయకులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్, రొద్దం మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, గోరంట్ల గిరిధర్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, సదాశివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంఘం సభ్యులు ఏర్పాట్లు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు