పెనుకొండ: మండలంలోని గుట్టూరు గ్రామ సచివాలయంలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ రుణాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంటల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. అనంతరం MPDOతో కలిసి వ్యవసాయ పొలాలను పరిశీలించి, సాగు పరిస్థితులు, పంటల నిర్వహణపై రైతులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, క్లస్టర్ ఇన్‌చార్జి బోయ ఆదిశేషు, టీడీపీ నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్‌లు