రొద్దం ఎస్‌ఐగా కుల్లాయరాజ్ బాధ్యతలు బీజేపీ నేతల మర్యాదపూర్వక భేటీ

రొద్దం, జూలై 14 (మీకోసం న్యూస్): రొద్దం పోలీస్‌ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన ఎం. కుల్లాయరాజ్‌ను బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్, మండల అధ్యక్షుడు కేఈ పవన్, జిల్లా ఓబీసీ కార్యదర్శి తోగుట రవిశంకర్, సీనియర్ నాయకుడు మహాదేవ, మండల ప్రధాన కార్యదర్శులు ఎం. తిప్పేస్వామి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఎస్‌ఐ నాయకులతో ఆత్మీయంగా మాట్లాడి సహకారం అందించాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు