కొగిర ఆర్‌ఎస్‌కేలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

రొద్దం: మండలంలోని కొగిర రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే)లో మండల వ్యవసాయాధికారి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన ఆధునిక సాగు విధానాలు, పంటల బీమా, ఈ-క్రాప్‌ నమోదు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పంటల బీమా, వ్యవసాయ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొని పంటల సాగు, బీమా, నమోదు తదితర అంశాలపై అధికారులతో చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు