మీకోసం న్యూస్ ప్రతినిధి -
కదిరి: జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త, స్వర్గీయ చెక్కా రమణ కుటుంబానికి అండగా నిలుస్తూ సత్యసాయి జిల్లా కాపునాడు, కదిరి నియోజకవర్గ జనసేన నాయకులు రూ.32 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు చెక్కా రమణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, కాపునాడు, జనసేన పార్టీ తరఫున భవిష్యత్తులో కూడా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కాపునాడు అధ్యక్షుడు ఇటికింటి మహేష్ రాయల్, గోరంట్ల నరేంద్ర రాయల్, కదిరి నియోజకవర్గ జనసేన నాయకులు గవ్వల శ్రీనివాసులు, మల్లెం మోహన్ (రాము), యంగనూరి సత్యవతి, ఈటీ. లోకేష్, కిన్నెర మహేష్, కుటాల నరేంద్ర, పట్నం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు