చేనేత కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్ ఆగస్టు 7న 'నేతన్నకు భరోసా' పథకం ప్రారంభం


 అమరావతి, జూలై 16 (మీకోసం న్యూస్): రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నేతన్నకు భరోసా' పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ప్రారంభించనుంది.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి ₹25,000 ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ₹250 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

చేనేత నేయుగాళ్లతో పాటు అనుబంధ చేనేత కార్మికులకు కూడా ఈ పథకం వర్తించనుంది. అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.

హైలైట్స్:

▶️ ఆగస్టు 7న 'నేతన్నకు భరోసా' ప్రారంభం

▶️ ఒక్కో లబ్ధిదారుకు ఏడాదికి ₹25,000 సాయం

▶️ 54 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం

▶️ ₹250 కోట్ల నిధుల కేటాయింపు

▶️ అనుబంధ చేనేత కార్మికులకు కూడా అవకాశం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు